ప్రముఖ నటుడు రాజశేఖర్ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. ఓ తమిళ రీమేక్ చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిసింది.
వివరాల్లోకి వెళితే, రాజశేఖర్ తమిళంలో విజయవంతమైన ‘లబ్బర్ పందు’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన కాలి చీలమండకు గాయమైంది. పరీక్షించిన వైద్యులు చీలమండలో క్రాక్స్ ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు. అనంతరం నాలుగు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
![]()
