నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. ‘డార్క్ కామెడీ’ అనే వైవిధ్యమైన జోనర్లో ఇది తెరకెక్కింది. ఈ నెల 19న విడుదల కానున్న నేపథ్యంలో, తాజాగా చిత్ర యూనిట్ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో బ్రహ్మానందం ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఆయన జడ్జి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన
మాట్లాడు తూ, ‘ఈ సినిమా కథను ప్రేక్షకులకు వివరించే కీలక బాధ్యత తన పాత్రదేన’ని తెలిపారు. ‘దర్శకు డు మురళీ మనోహర్ ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా ఒక సరికొత్త కథాంశాన్ని ఎంచుకున్నారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా తమ పాత్రల కోసం పడిన శ్రమ అద్భుతం. ముఖ్యంగా వారి ఓల్డ్ ఏజ్ గెటప్స్ చూసి నేను మొదట గుర్తుపట్టలేకపోయాను’ అని ప్రశంసించారు.
మాట్లాడు తూ, ‘ఈ సినిమా కథను ప్రేక్షకులకు వివరించే కీలక బాధ్యత తన పాత్రదేన’ని తెలిపారు. ‘దర్శకు డు మురళీ మనోహర్ ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా ఒక సరికొత్త కథాంశాన్ని ఎంచుకున్నారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా తమ పాత్రల కోసం పడిన శ్రమ అద్భుతం. ముఖ్యంగా వారి ఓల్డ్ ఏజ్ గెటప్స్ చూసి నేను మొదట గుర్తుపట్టలేకపోయాను’ అని ప్రశంసించారు. ![]()
