నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. జనాభా నియంత్రణకు, ఆర్థిక స్థోమతను పిల్లలను కనడానికి ముడిపెడుతూ ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“మన దేశంలో సెక్స్ గురించి ఎవరూ మాట్లాడరు కానీ, జనాభాలో మాత్రం మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తున్నారు, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని బాధపడతారు. కనే ముందే సరైన ప్లాన్ ఉండాలి కదా” అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక బిడ్డను పెంచి, చదివించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, అందుకే ఇంకొకరిని పోషించే స్తోమత ఉన్నప్పుడే పిల్లలను కనాలని ఆమె సూచించారు.
![]()
