యువ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మార్చి 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్, నగరాల్లో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న యువతరం జీవితాలను, వారి మధ్య చిగురించే ప్రేమను సహజంగా ఆవిష్కరించింది. థియేటర్లలో యువతను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా కథాంశం ఆసక్తికరంగా సాగుతుంది.
![]()
