కాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన అర్ధాంగి స్నేహారెడ్డి తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని రొమాంటిక్ ఫొటోలను పంచుకుంటూ భార్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
“హ్యాపీ యానివర్సరీ క్యూటీ. 15 ఏళ్ల మన ప్రయాణం. నువ్వు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు” అంటూ స్నేహారెడ్డితో కలిసి ఉన్న ఒక స్టైలిష్ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో స్నేహారెడ్డి నీలి రంగు గౌనులో మెరిసిపోతుండగా, అల్లు అర్జున్ నల్లటి సూట్లో హ్యాండ్సమ్గా కనిపించారు. మరో బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ.. “15వ యానివర్సరీ. నవ్వులు, స్నేహంతో సాగిన జీవితం” అని క్యాప్షన్ జోడించారు. ఇందులో సీక్విన్డ్ చీరలో నవ్వుతూ కనిపిస్తున్న స్నేహాను బన్నీ ప్రేమగా చూస్తూ నిల్చున్నారు.
![]()
