నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న చిత్రం ‘అఖండ 2’ గురించి నిర్మాతలు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. గతంలో ఘన విజయం సాధించిన ‘అఖండ’ చిత్రానికి ఇది సీక్వెల్గా వస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘హైందవం’ అనే మొదటి లిరికల్ పాటను విడుదల చేసింది.
ఈ పాటకు నాగ గురునాథ శర్మ సాహిత్యం అందించగా, ప్రఖ్యాత ‘సర్వేపల్లి సిస్టర్స్’ గాయనీమణులు శ్రేయ, రాజ్యలక్ష్మి తమ గాత్రంతో ఆలపించారు. ఎస్. థమన్ సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆధ్యాత్మిక భావనతో సాగే ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
![]()
