‘ఆడ బిడ్డలకు క్షమాపణలు’ అని సినీనటుడు శివాజీ అన్నారు. బుధవారం శివాజీ విలేకరులతో మాట్లాడుతూ … ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈవెంట్ నుంచి బయటకు రాగానే తాను చేసిన తప్పును గ్రహించినట్లు తెలిపారు. హీరోయిన్ల దుస్తులను ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే, ఆ సందర్భంలో రెండు అసభ్య పదాలను వాడినందుకు మాత్రం క్షమాపణ చెబుతున్నానన్నారు. ఆ రోజు వేదికపై ఉన్న తన తోటి నటీనటులు, ఆడ బిడ్డలకు క్షమాపణలు చెప్పారు.
![]()
