గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ‘గేదెల రాజు’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది. ‘కాకినాడ తాలూకా’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ద్వారా చైతన్య మోటూరి దర్శకుడిగా పరిచయం అవు తున్నారు. వాణి రవికుమార్ మోటూరి ఈ సినిమా నిర్మాత. దర్శకుడు చైతన్య ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. పలుమార్లు వాయిదా పడి ఇప్పుడు రాబోతోంది. రవి ఆనంద్ చిన్ని బిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కీలక పాత్ర పోషించిన రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించారు.
![]()
