నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2’ విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఆర్థికపరమైన కారణాలతో వాయిదా పడిన ఈ సినిమాను
ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ పరిణామం రెండు చిన్న సినిమాలను ఇబ్బందుల్లోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే, ‘అఖండ 2’ చిత్రాన్ని తొలుత డిసెంబర్ 5న విడుదల చేయాలని భావించారు. కానీ, చివరి నిమిషంలో తలెత్తిన ఫైనాన్షియల్ సమస్యల వల్ల సినిమా వాయిదా పడింది. తాజాగా ఆ సమస్యలన్నీ పరిష్కారమవడంతో, మరో మూడు రోజుల్లోనే చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
![]()
