హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’కు సీక్వెల్ ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ శుక్రవారంనాడు థియేటర్లలో విడుదల కానుంది. నిడివి 3.15 గంటలు. అవతార్ తొలి రెండు భాగాలు రికార్డు స్థాయి వసూళ్లు సాధించగా మూడో భాగంపై ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2009లో విడుదలైన ‘అవతార్’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 2022లో వచ్చిన రెండో భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మూడోపార్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జేమ్స్ కామెరూన్ థియేటర్ టెక్నీషియన్లకు ప్రత్యేక లేఖ రాయటంతో మరింత ఆసక్తి పెరిగింది. ![]()
