బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రం, తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సినిమా విడుదలైన రెండో
అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, రెండో శుక్రవారమైన 12వ తేదీన ఏకంగా రూ.34.70 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటివరకు ఈ రికార్డు ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ పేరిట (రూ.27.50 కోట్లు) ఉండేది. తాజాగా ఆ రికార్డును ‘ధురంధర్’ అధిగమించింది. ఈ జాబితాలో ‘ఛావా’ (రూ.24.30 కోట్లు), ‘యానిమల్’ (రూ.23.53 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
![]()
