స్టార్ హీరోయిన్ సమంత తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. నిన్న తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో వీరి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా సమంత ధరించిన ఎంగేజ్మెంట్ రింగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. గ్రీక్ డిజైనర్ రూపొందించిన ఈ వజ్రపు ఉంగరం విలువ దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా.
ఇదిలా ఉంటే.. సమంత ఆస్తుల విలువ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి సమంత నికర ఆస్తి విలువ రూ.100-110 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. సినిమాల ద్వారా ఆమె ఒక్కో చిత్రానికి రూ. 3 నుంచి 5 కోట్లు తీసుకుంటుండగా, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఏటా రూ. 8 కోట్ల వరకు సంపాదిస్తున్నారు.
![]()
