పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు
మరింత తీవ్రరూపు దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య ఉద్ధృతంగా సాగుతోంది. లెబనాన్ నుంచి తమపై దాడికి తెగబడిన హెజ్బొల్లాపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అటు ఇరాన్, దాని మిత్రదేశాలు, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడికి దిగాయి. ఈ దాడుల తీవ్రత పెరుగుతుండగా యుద్ధం నుంచి బయటపడే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలు సుదీర్ఘ పోరాటానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్య మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
![]()
