ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్టు వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ ప్రారంభమయ్యే యాషెస్ ఐదో టెస్ట్ తన కెరీర్లో చివరిదని శుక్రవారం ప్రకటించాడు. పాకిస్థాన్‌లో జన్మించిన ఖవాజా ఆస్ట్రేలియా తరపున ఆడిన తొలి ముస్లిమ్ క్రికెటర్. తను ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే 39 ఏళ్ల ఉస్మాన్ చివరి మ్యాచ్ ఆడుతుండడం గమనార్హం
![]()
