ఐపిఎల్ 2026లో భాగంగా కెకెఆర్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయి లోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కెకెఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. ముంబయి ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలుండగానే (19.1 ఓవర్లలో) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 
రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకాలతో ముంబయి గెలుపును ఖరారు చేయగా.. ఆతర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 16; 3 ఫోర్లు), తిలక్ వర్మ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు), నమన్ ధిర్ (2 బంతుల్లో 5 నాటౌట్; ఫోర్) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు.
![]()
