ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ప్రారంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ సమిష్టిగా మెరిసింది. తొలుత బౌలింగ్‌లో బర్గర్, ఆర్చర్, రవీంద్ర జడేజా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్కె) 127పరుగులకే పరిమితం చేసిన రాజస్తాన్ రాయల్స్.. అనంతరం సూర్యవంశీ 15బంతుల్లోనే అర్ధసెంచరీతో రాణించడంతో ఆ లక్ష్యాన్ని 12.1ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురవడం, టాస్ గెలవడం రాజస్తాన్‌కు కలి సొచ్చింది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకోగా… బౌలర్లు కెప్టెన్ నమ్మకాన్ని
వమ్ము కానీయలేదు. చెన్నై బ్యాటర్లను క్రీజ్‌లో కుదురుకోనివ్వక… వరుసగా వికెట్ల పడగొట్టారు. దీంతో చెన్నై 19పరుగులకే 3వికెట్లు, ఆ తర్వాత 51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ లక్ష్యాన్ని రాజస్తాన్ 12.1ఓవర్లలో కేవలం 2వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
![]()
