రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్ ఎయిర్పోర్టు) తరచుగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం.. ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీలు చేయడం… చివరకు అది ఫేక్ బెదిరింపు అని తేలడం పరిపాటిగా మారిపోయింది. రోజు విడిచి రోజు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో భద్రతా సిబ్బంది కూడా ఎంతో అలర్ట్గా ఉండి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే వరుస బాంబు బెదిరింపులతో విమానాశ్రయంలోని ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి.
![]()
