నేషనల్ హెరాల్డ్ కేసులో ఇడి పిటిషన్‌పై సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఢిల్లీహైకోర్టు సోమవారం నోటీసులిచ్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఇడి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతిస్పందన తెలపాల్సిందిగా వారిని ఆదేశించింది. ఈ మేరకు డిసెంబరు 16నాటి ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే విధించాలన్న ఇడి దరఖాస్తుపై, అలాగే ప్రధాన పిటిషన్‌పై జస్టిస్ రవీందర్ దుడేజా వారికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇడి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడం చట్టప్రకారం కుదరదని, ఈ ఫిర్యాదు ఎఫ్ఐఆర్లో కనిపించడం లేదని ట్రయల్ కోర్టు పేర్కొంది.
![]()
