ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి సీఎం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ఈవో, అర్చకులు మహాద్వారం వద్ద ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, మనుమడు దేవాంశ్తో కలిసి ఆలయం లోనికి వెళ్లిన సీఎం శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు పండితుల వేదాశీర్వచనాలు చేశారు. అనంతరం అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
![]()
