రాష్ట్రంలోని అర్హులందరికీ 2029 కల్లా గృహవసతి కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా
నాయుడు అన్నారు. రెండో విడతల్లో 5.50 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయించామని తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి మరో రెండు లక్షలు, సెప్టెంబర్ కల్లా మరో 1.60 లక్షల గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. మిగిలిన పేదలకు ఎన్నికల హామీలో భాగంగా నగరాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం బిరుదువాడలో 2,064 టిడ్కో ఇళ్లను సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. కొత్తింట్లోకి వెళ్లిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారు ముక్కర అంబిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొని పూజలు నిర్వహించారు. మరో లబ్ధిదారు షేక్ నూరి కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయం ప్రకారం గృహప్రవేశంలో పాల్గొన్నారు.
![]()
