కార్యకర్తలను పట్టించుకోని వాళ్లు, ఇబ్బంది పెట్టే నాయకులు పార్టీకి అవసరం లేదని తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. కష్టపడిన వాళ్లను కాపాడుకుంటూ పని చేసిన వాళ్లను గుర్తించి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఈ సారి 50 శాతం సీట్లు పెరగడంతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తున్నందున రాజకీయ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుందని ఉద్ఘాటించారు. అమరావతి దేవతల రాజధాని కాబట్టి కొందరు రాక్షసులకు ఇష్టం లేదని జగన్ను ఉద్దేశించి దుయ్యబట్టారు.
పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కేంద్రమంత్రి పెమ్మసాని, సీనియర్ నాయకులతో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
![]()
