రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా ‘పెద్ది’. ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ని మార్చి 2న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సుమారు 1000 మంది డ్యాన్సర్లతో అత్యంత భారీ స్థాయిలో ఈ ఇంట్రడక్షన్ సాంగ్‌ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ![]()
