దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. పెంచిన రైలు ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జులైలో ఒకసారి ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ, కేవలం ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరలను పెంచడం గమనార్హం. మెయిల్/ఎక్స్ప్రెస్, ఏసీ క్లాసులతో పాటు, 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఆర్డినరీ నాన్-ఏసీ క్లాసులపై కూడా ఈ పెంపు ప్రభావం చూపనుంది. 
![]()
