ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్యాలెండర్ మారుతున్న వేళ.. కిరిబాటి దీవుల తర్వాత న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం 2026కు ఘన స్వాగతం పలికింది. అక్కడి స్థానిక సమయం ప్రకారం గడియారం ముల్లు 12 దాటగానే.. ఆక్లాండ్ నడిబొడ్డున ఉన్న న్యూజిలాండ్ ఎత్తైన కట్టడం ‘స్కై టవర్’ బాణసంచా వెలుగులతో మెరిసిపోయింది.
![]()
