తెలంగాణ ముఖ్యమంత్రి
, సిద్దిపేట గడ్డపై సంచలన రాజకీయ హామీ ఇచ్చారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ ఎమ్మెల్యేను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగిన రైతు మహోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్న సిద్దిపేట రాజకీయాల్లో మార్పు తప్పనిసరని సీఎం పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే, ఆ ఎమ్మెల్యేను మంత్రిని చేసే బాధ్యతను తాను, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి తీసుకుంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఒక్కోదానికి 3,500 చొప్పున మొత్తం 10,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
![]()
