మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆసక్తికరమైన వార్త. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి పునరావృతం కానుంది. మెగాస్టార్ కెరీర్లో 158వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
ఈ నెలాఖరులోగా సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి షెడ్యూల్లో చిరంజీవిపై కొన్ని సోలో ఎంట్రీ సన్నివేశాలను, ఆ వెంటనే ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
![]()
