కేరళ ఇకపై కేరళం కానుంది. ఈ రాష్ట్రం పేరును మార్చడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రతిపాదనకు మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే ఆ ప్రతిపాదన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించాలి.
రాష్ట్ర పేరు మార్పు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకుంటారు. తర్వాత బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఆ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో పేరు అధికారికంగా మారుతుంది. ఈ ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.
![]()
