పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో దేశం కోవిడ్ కాలం నాటి సంక్షోభం వంటి దీర్ఘకాలిక సంక్షోభం వైపు పయనిస్తోందని, దానిని ఎదుర్కొనేందుకు పౌరులు సంపూర్ణంగా సిద్ధంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తె
లిపారు. దేశంలోని ఘర్షణల వల్ల ఏర్పడిన సంక్షోభం గురించి మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. ‘ఇంధన సరఫరా గొలుసులలో అంతరాయం, ధరల పెరుగుదల సుదూర పరిణామాలకు దారి తీస్తాయి. యుద్ధం వల్ల కలిగే సంక్షోభం దీర్ఘకాలం కొనసాగుతుంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. కోవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించడానికి ఉన్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా, యుద్ధకాల సంక్షోభాన్ని పరిష్కరించడానికి కూడా ఉన్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేస్తారు. ఇంధనం, సరఫరా గొలుసులు, ఎరువుల పంపిణీ, ధరల పెరుగుదలను నియంత్రించడం వంటి అంశాలకు సంబంధించిన వ్యూహాలను ఈ బృందాలు రూపొందిస్తాయి. ఈ సంక్షోభాన్ని అధిగ మించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి. కష్టకాలంలో మాదిరిగానే, కార్మికులు, నిరుపేదలు ఎక్కువగా నష్టపోతారు. వారిని ఆదుకోవడానికి రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి. నల్లబజారు, నిల్వలను నివారించడానికి చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు.
![]()
